Big News Big Debate : Verbal war between political parties over AP Special Status || Rajinikanth TV9

Android

Video is ready, Click Here to View ×


Big News Big Debate : Verbal war between political parties over AP Special Status || Rajinikanth TV9

► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Circle us on G+: https://plus.google.com/+tv9
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu
► Pin us on Pinterest: https://www.pinterest.com/Tv9telugu

41 thoughts on “Big News Big Debate : Verbal war between political parties over AP Special Status || Rajinikanth TV9

  1. Raods veyyakapoyina parledu..kotta industries, IT companies teskurakapoyina parledu..Agricultural tech develop cheyyakapoyina parledu.. Special status isthey chalu anni vachesthay. Govt employees chetha strict ga pani cheyyinchakapoyina parledu..vallaki pani cheyyamani chepthey next time votes veyyaru. yevaru kastapadi pani cheyyakkarledu..just special status isthey anni panulu ayipothay..AP develop ayipothundi.

  2. Andhra lo prajalaki special status ye life. special status kosam jobs manesi schools musesi bandh chestharu. special isthey antha happy. SPecial status antey development..developmenet antey special status. already special status unna states india lo top ayipoyay..manalni vidadeesina congres ye manaki special status isthundi..congress infrastucture developments.FRD em cheyyakapoyina special status isthey chalu AP ki anni chesinattey..

  3. special status isthey jagan India lo ne best politician ayipothadu. Special status isthey BJP ki nastam andukani kavalaney ivvataledu..lekapothey special status ivvakapovadaniki em karanalu untay..status isthey BJP ki direct ka chala nastam..special status isthey Votes padavu andukey ivvatledu.

  4. special status okkati isthey chalu..manaki anni vachesthay..corruption pothundi..andaru okka rojulo happy ayipotharu..special status isthey buldings, IT comapnies anni okka rojulo vahcesthay. special status isthey Andhra pradesh ki unna money lotu okka night lo taggipothundi. special status isthey AP india lo no 1 ayipothunid. special status isthey janalu andaru manchiga maripotharu..dabbulu teeskokunda votes vestharu..special status okkatey Andhra ki unna proboem. special status is everything. special status untey jobs industries vasthay.

  5. Eee BJP vallu U Turn theesuko leda, Parliamentary lo vada icharu, thirupathi lo nellore lo itchina vagdan mari ippudu ivvatam ledu mari idhi ee turn ayya, Raghu anni vadeleysadi, puttina gaddakey annyam chesey ee bjp vallu anni vedelesaru

  6. రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ మోహన్ రెడ్డి , చంద్ర బాబు కొడుకు లోకేష్ వీళ్ళే మనకి దిక్కా , వీళ్ళు తప్ప మనకి వేరే నాయకులే లేరా..వీళ్ళని మన మీద రుద్ది వాళ్లకి బానిసత్వం చెయ్యడానికి ఇంకా మనమేమన్న మన తాతల కాలం లో బతుకున్నామా..

  7. సోది చెబుతానమ్మ…. సోది చెబుతాను…
    కేంద్రం ఇచ్చినవి ఇవ్వనట్లు చెబుతాను….
    కేంద్రం ఇచ్చే పథకాలు నావని చెబుతాను…
    అమరావతిలో లేనివి వున్నట్లు చెబుతాను…
    మాపచ్చ మీడియాను నా భజన చేయమని చెబుతాను..
    సోది చెబుతా నమ్మ…

  8. హోదా పేరు ఎత్తితే జైలుకు పంపిస్తామన్నారు. హోదా కోసం పోరాడుతున్న వైసిపి అధినేత ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేశారు. పాకేజీ కోసం సకల ప్రయత్నాలను చేశారు. పాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పగానే, పోలవరం నిర్మాణ అంచనాలను పదహారువేల కోట్ల రూపాయలనుంచి యాభై ఎనిమిదివేల కోట్ల రూపాయలకు పెంచేశారు.

    ఇంతలోనే కేసీయార్ చంద్రబాబును ఓటుకు నోటు కేసులో చక్రబంధం చేసేసారు. చంద్రబాబు ఊహించని ఉత్పాతం అది! దాంతో పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదులుకుని తనను నమ్ముకున్న సీమాంధ్రులను నట్టేట ముంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అమరావతికి పారిపోయారు. తెలంగాణాలో ఆంధ్రా పోలీస్ స్టేషన్స్ పెడతామని బీరాలు పలికి మళ్ళీ ఆ ఊసే మర్చిపోయారు.

    వెంకయ్య చేసిన రాజకీయాల ఫలితంగా కేసీయార్ కు చంద్రబాబుకు రాజీ కుదిరింది.

    అప్పటినుంచి కేసీయార్ కు వీరవిధేయుడిగా మారిపోయారు. కేసీయార్ ఎంత విమర్శించినా, నోరు విప్పి ఎదురు విమర్శ చేసే సాహసం చేయలేకపోయారు.

    చంద్రబాబు మెడ మీద క్షణక్షణం వేలాడే కత్తిలా ఓటుకు నోటు కేసును కేసీయార్ సజీవంగా ఉంచారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోతే ఆ ఉచ్చు చంద్రబాబుకు బిగించడానికి కేసీయార్ ఏమాత్రం వెనుకాడరు.

    ఇక ప్రత్యేక హోదా ఉద్యమం తారాజువ్వలా ఎగిసిపడింది జగన్ పాదయాత్ర ప్రారంభం తరువాతే. జగన్ చేసిన పోరాట ఉధృతి ఫలితంగానే చంద్రబాబు కేంద్రంతో సంబంధాలు తెంచుకోవలసి వచ్చింది. జగన్ చేసిన పోరాటం కారణంగానే తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ బయట నాటకాలు ఆడాల్సి వచ్చింది. జగన్ తెగించి తన ఎంపీలతో రాజీనామా చేయించినా చంద్రబాబు మాత్రం ఆ సాహసం చేయలేకపోయారు. అవిశ్వాసం పేరుతో మరో నాటకం ప్రదర్శించారు. నాడు అసెంబ్లీలో జగన్ చేసిన ఉపన్యాసమే నిన్న గల్లా జయదేవ్ చదివి నవ్వులపాలయ్యారు!

    ఎవరేమైనా అనుకోని, నిన్నటి రాజకీయాలలో జగన్ హీరోగా నిలిచాడు. చంద్రబాబు జీరోగా మిగిలిపోయాడు. జగన్ అనేవాడు లేకపోతె ప్రత్యేకహోదా అనేది ఏనాడో భస్మమై పోయి ఉండేది.
    ఆంధ్రులు ఈ విషయాన్ని గ్రహించుకుంటే మంచిది.

  9. రాజుగారి పెద్దభార్య పతివ్రత అంటే
    చిన్నభార్య కాదనేగా అర్ధం…
    కేసీఆర్ పరిణితి చెందిన నాయకుడు అని ప్రధాని అంటే చంద్రబాబు కాదనేగా అర్ధం..
    తెలంగాణ అభివృద్ధి పథంలో వెళ్తున్నది అంటే
    ఆంధ్రప్రదేశ్ తుచ్ఛ రాజకీయాలతో
    వెనుకబడి పోతున్నదనేగా అర్ధం!
    అవిశ్వాసం పెట్టినది అసమర్థుడిగా ప్రధానమంత్రి తో
    ముద్ర వేయించుకోడానికేనా చంద్రబాబు గారూ??
    కూలీ ఇచ్చి తిట్టించుకోవడం అంటే
    ఇదేకదా చంద్రబాబు గారు?
    అనుభవం అంతా మాయమై పోయి
    అడుసులో కాలు వేశారు

  10. "నేను యూ టర్న్ తీసుకోలేదు. మీరే తీసుకున్నారు"

    "నేను మోసం చెయ్యలేదు …మీరే మోసం చేశారు"

    "నేను అబద్ధాలు చెప్పడం లేదు…మీరే అబద్ధాలు చెబుతున్నారు"

    "నేను మీకంటే సీనియర్ ను"

    "నేను పాకేజికి ఒప్పుకోలేదు"

    నలభై సంవత్సరాల అనుభవం కలిగిన నాయకుడినుంచి ఇలాంటి ప్రకటనలు ఊహించగలమా? "నేను పిచ్చోడిని కాదు… నువ్వే పిచ్చోడివి…నీ అబ్బ పిచ్చోడు.. నీ తాత పిచ్చోడు" అని చిన్నపుడు పిల్లలు ఆదుకునే తొండాటలకు, చంద్రబాబు మాటలకు ఏమైనా తేడా ఉన్నదా?

    చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి మోడీ ప్రయత్నం చేశారట!

    మరి చంద్రబాబు చేసింది ఏమిటి? బీజేపీతో బంధాలు తెంచుకున్న తరువాత బీజేపీని దోషిగా నిలబెట్టడానికి చెయ్యని ప్రయత్నం ఉన్నదా? నాలుగేళ్లు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి చేసిన మహోద్యమానికి వెరచి, ఒక్కసారిగా పాకేజీ నుంచి ప్రత్యేకహోదాపై యూ టర్న్ తీసుకోవడం పరిణితి అనిపించుకుంటుందా?

    అసలు పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిది అని విభజన చట్టంలో ఉన్నపుడు అదేదో కేంద్రం నెత్తిన వెయ్యకుండా, కమీషన్లకు కక్కుర్తి పడి ఆ పోలవరాన్ని బలవంతంగా లాక్కోవడం, దాని కాంట్రాక్టును తెలుగుదేశం ఎంపీకి కట్టబెట్టడం లో ఏమైనా పరిణితి ఉన్నదా? చట్టం ప్రకారం కేంద్రం పోలవరాన్ని నిర్మించకపోతే అప్పుడు బీజేపీని దోషిగా నిలబెట్టినా ఒక అర్ధం ఉంటుంది. ప్రజలు కూడా నమ్ముతారు. కానీ, చంద్రబాబు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? ఎవరికోసం తీసుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీల వెంటపడుతున్న చంద్రబాబు పోలవరాన్ని కూడా సింగపూరుకో, జపానుకో ఇవ్వక తన పార్టీ ఎంపీకి ఎందుకు కట్టబెట్టారు?

  11. ప్రధాని తీరు ఇలాగా అంటూ హేళన చేసిన బాధాకృష్ణకు చంద్రబాబు తీరు ఎలా ఉన్నదో కనిపించడం లేదా? ప్రతిపక్షం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలను, ఎంపీలను పశువులకన్నా హీనంగా కొనుగోలు చేసి, ప్రతిపక్షం గొంతును అసెంబ్లీలో నొక్కేసి, చివరకు వారు సభను బహిష్కరించేంత తీవ్రచర్యకు పూనుకోవడానికి కారకులు చంద్రబాబు కాదా?
    ప్రత్యేక హోదా కోసం వైసిపి ఎంపీలు తమ పదవులను తృణప్రాయంగా వదులుకున్నప్పుడు, హోదా కావాలని నిజంగా అనుకుంటే తెలుగుదేశం ఎంపీలు కూడా ఎందుకు రాజీనామాలు చెయ్యలేదు? ఇప్పటికైనా మునిగింది లేదు. నెలరోజుల లోగా హోదా ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం అని చంద్రబాబు ప్రకటిస్తే కేంద్రం దిగివస్తుంది. హోదా తెచ్చిన ఖ్యాతి చంద్రబాబు ఖాతాలోకే వెళ్లనీ, మళ్ళీ చంద్రబాబే అధికారం చేపట్టనీ…. అభ్యంతరం లేదు. అసలు అలా సవాలు విసిరే సాహసం చంద్రబాబుకు ఉన్నదా?

  12. నాకు బాగా గుర్తుంది. గత నాలుగేళ్లలో చంద్రబాబు ఇరవైతొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్ళినప్రతిసారి మోడీ, కేంద్రమంత్రులు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒకరి భుజాలు ఒకరు తట్టుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. కానీ, ఎప్పుడైతే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పోయారో… ఆ తరువాత మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు! కావాలంటే ఒకసారి పాత పత్రికలూ, వీడియోలు తిరగేసుకోండి! చంద్రబాబు ఆ కేసులో బుక్ కావడమే ఆంద్రప్రదేశ్ పతనానికి తొలి మెట్టు వేసింది!
    ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, ప్యాకేజీలు రాకపోవడానికి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావడానికి కారకులు ముమ్మాటికి చంద్రబాబే. ఇతరుల నెత్తిన మన్నువేసి తాను తప్పించుకోవాలను
    కుంటే ప్రజలు సహించరు. క్షమించరు.
    అప్పుడెప్పుడో చంద్రబాబు ను యూ టర్న్ అంకుల్ అని సంబోధించారు విజయసాయిరెడ్డి. మొన్న మోడీ కూడా అదే మాట అన్నారు. మనుషులను బట్టి దోషులకు సంబోధనలు మారవు!
    "మోడీ…ఏపీ చేసిన పాపం ఏమిటి?" అని ప్రశ్నించారు బాధాకృష్ణ.. చంద్రబాబును ఎన్నుకోవడమే ఏపీ చేసిన మహాపాపం!

  13. టిడిపి పార్టీ ని బొంద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఎందుకంటే ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని హోదా గురించి ఎవరైనా మాట్లాడితే జైలుకు పంపిస్తాం అన్న పెద్దమనుషులు యూటర్న్ తీసుకుని మాకు ప్రత్యేక హోదా కావాలి అంటారు… వీళ్ళు చేసే డ్రామాలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *